
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఐసీయూ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సిం గ్ సిబ్బంది జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సీనియర్ అసిస్టెంట్ కె. భార్గవ్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఆస్పత్రిలోని ఐసీయూలో కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జీతాలు రాలేదని ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు.
దీనిపై విచారించగా ఆల్ఫా స్వయం శక్తి సంఘం కాంట్రాక్ట్ పీరియడ్ గత మార్చి31తో ముగిసింది . 2025- – 26 ఆర్థిక సంవత్సరానికి కొత్త ఏజెన్సీకి కేటాయించడం, అదే ఏజెన్సీని రెన్యువల్ చేసే విషయమై సీనియర్ అసిస్టెంట్ కె. భార్గవ జిల్లా ఉపాధి కల్పనా అధికారికి ఎలాంటి ఫైల్‌ను పంపలేదని తేలింది. జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించినందుకుగాను భార్గవ్ ను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే సస్పెన్షన్ లో కొనసాగుతారు.