నెట్వర్క్, వెలుగు:బంకించంద్ర ఛటర్జీ వందేమాతర గీతాన్ని రచించి 150 ఏండ్లయిన సందర్భంగా శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు సామూహికంగా వందేమాత గీతాన్ని ఆలపించారు. జాతీయ జెండాలు పట్టుకొని, ర్యాలీలు తీశారు. వందేమాతర గీతం ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని నింపి, స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని నల్గొండ కలెక్టర్ఇలా త్రిపాఠి, యాదాద్రి అడిషనల్కలెక్టర్వీరారెడ్డి అన్నారు.
వందేమాతర గీతం స్ఫూర్తితో ఎందరో త్యాగధనులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా కేంద్రంలో 2 వేల మంది పౌరులు, విద్యార్థులు, పోలీస్సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ సీతారామారావు ఉద్యోగులతో కలిసి వందేమాతరం ఆలపించారు. యాదగిరిగుట్టలోని వైకుంఠ ద్వారం వద్ద ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థులు, స్థానికులు ఒక్కచోట చేరి, వందేమాతర గీతాన్ని పాడారు.
