నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ చెక్కుల పంపిణీ

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్లకు చెందిన పలువురికి  మంజూరైన సీఎం రిలీఫ్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ చెక్కులను బుధవారం ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి హాలియాలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ పేదలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి ఎంపీపీ ఆంగోతు భగవాన్‌‌‌‌‌‌‌‌ నాయక్, నాయకులు రమావత్‌‌‌‌‌‌‌‌ రవికుమార్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎంపీటీసీ బుడిగపాక నాగేంద్ర లక్ష్మయ్య, జిల్లా ఏడుకొండలు, రమణారెడ్డి, చిరంజీవి, అంజిబాబు  పాల్గొన్నారు. 

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి


దేవరకొండ, వెలుగు : దేవరకొండ పట్టణంలో ఈ నెల 28న నిర్వహించనున్న అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల జిల్లా మహాసభలను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ హెల్పర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు పల్లా దేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలపై రోజురోజుకు పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు.  అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లకు నెలకు రూ.24 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి నూనె రామస్వామి, నాయకులు వి.రాధిక, ఎన్‌‌‌‌‌‌‌‌.ప్రభావతి, కే.లక్ష్మి, ఎన్‌‌‌‌‌‌‌‌.అరుణ, కళావతి, రేణమ్మ, కవిత, విజయలక్ష్మి పాల్గొన్నారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలి

దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రజాదీవెన సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. మునుగోడు అభివృద్ధి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తోనే సాధ్యం అవుతుందన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి బైపోల్‌‌‌‌‌‌‌‌లో మూడో స్థానంలో నిలుస్తారన్నారు. అంతకు ముందు దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం నాబార్డు ఆధ్వర్యంలో మర్రిచెట్టుతండా రైతులకు స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌, టీవీఎన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆర్‌‌‌‌‌‌‌‌.దస్రునాయక్‌‌‌‌‌‌‌‌, దొంతం చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, హన్మంతు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

కోదాడ, వెలుగు : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కోదాడఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా చిలుకూరులో నిర్మిస్తున్న వీరాంజనేయ స్వామి ఆలయానికి బుధవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మండల అధ్యక్షుడు కొండా సైదయ్య, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జనార్దన్‌‌‌‌‌‌‌‌, మాజీ జడ్పీటీసీ భట్టు శివాజీనాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగయ్య పాల్గొన్నారు. అనంతరం కోదాడలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రోగులకు పండ్లు, కిశోర బాలికలకు కిట్లు అందజేసి మొక్కలు నాటారు. ఆయన వెంట ఆర్డీవో కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డాక్టర్లు కళ్యాణ్‌‌‌‌‌‌‌‌చక్రవర్తి, రజని, లక్ష్మీప్రసన్న, సుధీర్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, మౌనిక పాల్గొన్నారు.

కోదాడకు డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌ మంజూరు

సూర్యాపేట, వెలుగు : కోదాడలో డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పేషెంట్లు డయాలసిస్‌‌‌‌ కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సెంటర్‌‌‌‌ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌‌‌‌రావుకు థాంక్స్‌‌‌‌ చెప్పారు.

ఎమ్మెల్యేలూ.. రాజీనామా చేయండి !
ఆలేరు ఎమ్మెల్యే సునీత రాజీనామా చేయాలని సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌

యాదాద్రి, వెలుగు : మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేయడం, అక్కడ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌ జరుగుతుండడంతో జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేయాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోంది. ఇందులో భాగంగా ‘ఆలేరు అభివృద్ధి కావాలంటే గొంగిడి సునీత రాజీనామా చేయాలి’ అన్న పోస్టులు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారాయి. ‘ఎమ్మెల్యే గారూ మీరు రాజీనామా చేయండి.. మీరు చేయలేని డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఉపఎన్నిక చేస్తుంది. మీరు రాజీనామా చేస్తే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నిధులు ఇస్తారు, ఆ తర్వాత మళ్లీ మిమ్మల్నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం’ అంటూ కొందరు వ్యక్తులు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇప్పుడు ఈ పోస్టు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 

ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే జిల్లా బాగుపడుతది

యాదాద్రి, వెలుగు : ‘జిల్లా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే నిధులు వస్తయ్‌‌‌‌‌‌‌‌, జిల్లా డెవలప్‌‌‌‌‌‌‌‌ అవుతది, ఆలేరుకు గంధమళ్ల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ వస్తది, ఆలేరు రెవెన్యూ డివిజన్‌‌‌‌‌‌‌‌ అవుతది’ అని యాదాద్రి జెడ్పీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌‌‌‌‌‌‌‌ కే.నగశ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బుధవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్‌‌‌‌‌‌‌‌ బైపోల్‌‌‌‌‌‌‌‌ టైంలో దళితబంధు అమలు చేశారని, ఇప్పుడు మునుగోడులో ఉపఎన్నిక కారణంగా రూ.220 కోట్ల నిధులు విడుదల చేశారని, 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారని, హడావుడిగా రోడ్లు వేస్తున్నారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేశారు కాబట్టి నిధులు వస్తున్నాయని, అలాగే జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రిజైన్‌‌‌‌‌‌‌‌ చేస్తే భారీగా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. భువనగిరి ఎమ్మెల్యే రిజైన్‌‌‌‌‌‌‌‌ చేస్తే బీసీ బంధు వస్తదని, రోడ్లు బాగుపడతాయన్నారు. ‘మీరు రాజీనామా చేస్తే మేము పోటీ కూడా చేయకుండా తిరిగి మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అని చెప్పారు. 

రక్తదానానికి ముందుకు రావాలి

యాదాద్రి, వెలుగు : రక్తదానం అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, రక్తం ఇవ్వడం వల్ల మరొకరికి పునర్జన్మ ఇచ్చిన వారు అవుతారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఆలేరు సీహెచ్‌‌‌‌‌‌‌‌సీ సెంటర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ తివారి సహ 150 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీసీపీ కె.నారాయణరెడ్డి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఆంజనేయులు, వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ కృష్ణయ్య, డాక్టర్లు ప్రశాంత్, దినేశ్, రాజేందర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాల నిర్వహణ అభినందనీయం

తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో ఏర్పాటు చేసిన బ్లడ్‌‌‌‌‌‌‌‌ డొనేషన్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ను బుధవారం డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో కోట చలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు రాంప్రసాద్, హరిచంద్రప్రసాద్, ఎంపీడీవో భీంసింగ్, డీఐవో వెంకటరమణ పాల్గొన్నారు. 

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మున్సిపల్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జక్కుల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకారెడ్డి, డీసీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ కరుణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ కమలాకర్‌‌‌‌‌‌‌‌ సహా 77 మంది రక్తదానం చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో నిరంజన్‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ జయశ్రీ, డాక్టర్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్, సీఐ రామలింగారెడ్డి పాల్గొన్నారు.

‘జాతీయ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ 14566’ పోస్టర్‌‌‌‌ ఆవిష్కరణ

యాదగిరిగుట్ట, వెలుగు : అత్యాచారాలను నిరోధించేందుకు యాత్ర స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ‘జాతీయ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ 14566’ ప్రచార పోస్టర్‌‌‌‌ను బుధవారం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌‌‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సమగ్రంగా అమలుపర్చాలని కోరారు. ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సంస్థ చైర్మన్‌‌‌‌ సుర్పంగ శివలింగం, బూడిద జాని పాల్గొన్నారు. 

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తోనే సంక్షేమ పథకాల అమలు

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కే ఓటు వేయాలని హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడేనికి చెందిన 50 మంది బుధవారం సైదిరెడ్డి సమక్షంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న నిర్వహించే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సభకు భారీ సంఖ్యలో జనాలను తరలించాలని సూచించారు. మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ సుర్వి మల్లేశ్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మండల కోశాధికారి పరమేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బొమ్మని స్వామి, పర్నె విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్పారు. చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మండలం గుడిమల్కాపురానికి చెందిన గాలి సురేశ్‌‌‌‌‌‌‌‌కు దళితబంధు కింద మంజూరైన హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ షాపును బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. దళితబందును ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వెన్‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజు, నారాయణపురం జడ్పీటీసీ వీరమల్ల భానుమతి, గుడిమల్కాపురం సర్పంచ్‌‌‌‌‌‌‌‌ మన్నె పుష్పలత, చిత్రసేనారెడ్డి, సిద్ధగోని శ్రీనివాసులు పాల్గొన్నారు.

కారు కింద పడి చిన్నారి మృతి

కోదాడ, వెలుగు : కారు కింద పడి 18 నెలల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరులో బుధవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... చిలుకూరుకు చెందిన సంక్రాంతి విజయశేఖర్‌‌‌‌‌‌‌‌, శిరీషకు ఇద్దరు కుమార్తెలు. విజయశేఖర్‌‌‌‌‌‌‌‌ బంధువులు మధ్యాహ్నం కారు తీసుకొని అతడి ఇంటికి వచ్చారు. డ్రైవర్‌‌‌‌‌‌‌‌ కారును విజయశేఖర్‌‌‌‌‌‌‌‌ ఇంటి ఎదురుగా ఉన్న మరో ఇంట్లోని చెట్టు కింద పార్క్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆ టైంలో విజయశేఖర్‌‌‌‌‌‌‌‌ చిన్న కుమార్తె షణ్ముక అక్కడే ఆడుకుంటోంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారిని గమనించని డ్రైవర్‌‌‌‌‌‌‌‌ కారును ముందుకు కదిలించడంతో టైరు చిన్నారి పైనుంచి వెళ్లింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు చిన్నారిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించేలోపే చనిపోయింది.

సాగర్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్న నీటి విడుదల

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి 3,39,214 క్యూసెక్కుల వరద వస్తుండడంతో రెండు గేట్లను మూసివేశారు. 24 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి 3,49,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.20 అడుగుల నీరు నిల్వ ఉంది. ఎడమ కాల్వకు 8,541 క్యూసెక్కులు, కుడికాల్వకు 8,604, ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీకి 2,400, వరదకాల్వకు 300 క్యూసెక్కులు, మెయిన్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌కు 30,369 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. 

పులిచింతలకు పెరిగిన ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌ ఫ్లో పెరిగింది. ఎగువ నుంచి 3,23,880 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 12 గేట్ల ద్వారా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం 39.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

రైతుల బాగు కోసం పనిచేయాలి

నకిరేకల్, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని కడపర్తి రోడ్డులో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘం బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల బాగు కోసం ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు కృషి చేయాలని సూచించారు. రైతులందరిని సంఘటితం చేసేందుకు సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్క్‌‌‌‌‌‌‌‌ట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కొప్పుల ప్రదీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

ఆక్రమించుకున్న ఇండ్లను ఖాళీ చేయండి

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ శివారులోని ఫణిగిరి గుట్ట వద్ద గల ఇందిరమ్మ ఇండ్లను ఆక్రమించుకున్న వారు వెంటనే ఖాళీ చేయాలని తహశీల్దార్‌‌‌‌‌‌‌‌ జయశ్రీ ఆదేశించారు. బుధవారం పోలీసులతో కలిసి కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ పనులు పూర్తయ్యాక లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందజేస్తామని చెప్పారు. గురువారం 10 గంటల్లోగా ఇండ్లను ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఆక్రమణదారులు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్పీ కాల్వ ఒడ్డున గుడిసెలను తొలగించి 2 నెలల్లో డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లు ఇస్తామని చెప్పి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాయిలు కట్టలేక నిరుపయోగంగా ఉన్న డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లలో ఉంటుంటే, ఇప్పుడు ఖాళీ చేయించాలని చూడడం  సరికాదన్నారు.

‘టీడీపీ దీక్షకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకపోవడం సరైంది కాదు’

మునుగోడు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడులో టీడీపీ దీక్షకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకపోవడం సరైంది కాదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. మంగళవారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని సమస్యలపై ఈ నెల 18న సభ దీక్ష చేసేందుకు నిర్ణయించామని, అయితే సీఎం సభ ఉందని చెప్పి తమకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. 20న సీఎం సభ ఉంటే 18న పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. పర్మిషన్‌‌‌‌‌‌‌‌ కోసం వెళ్లిన వారి పట్ల నల్గొండ డీఎస్పీ అనుచితంగా మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసులు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకపోవడంతో దీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు యాదయ్య, మునుగోడు గ్రామ శాఖ అధ్యక్షులు సింగం గిరిధర్‌‌‌‌‌‌‌‌, నెట్టు శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, పొడపంగి సైదులుమాధవ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి


నకిరేకల్‌‌‌‌‌‌‌‌ (కేతేపల్లి), వెలుగు : కారు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన గంగరాజు (62) కేతేపల్లి మండలంలో గల ఓ హోటల్‌‌‌‌‌‌‌‌లో వంట మాస్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూ చీకటిగూడెంలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి పని ముగిసిన తర్వాత హైవేపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ టైంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు గంగరాజును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు. మృతుడి అల్లుడు ఈర్ల రవికుమార్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.

వక్ఫ్‌‌‌‌‌‌‌‌ భూముల పరిశీలన

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆక్రమణకు గురైన వక్ఫ్‌‌‌‌‌‌‌‌బోర్డు భూములను బుధవారం నల్గొండ సీఐడీ ఆఫీసర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలో మస్జిదే ఏ సారాయే మిరాలం పరిధిలో కబ్జాకు గురైన 240 గజాల స్థలానికి కొలతలు తీసుకున్నారు. అలాగే కుండల బజార్‌‌‌‌‌‌‌‌లోని మదీనా కాంప్లెక్స్ పరిధిలోని 2,954 గజాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని ఆఫీసర్లు తెలిపారు. సీఐడీ నల్గొండ డీఎస్పీ ఎర్ణ, సీఐలు నాగరాజు, జానకిరాములు, ఎస్సై నాగార్జున, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ శ్యాంసుందర్, సర్వేయర్‌‌‌‌‌‌‌‌ ఖాద్రీ తదితరులు ఉన్నారు.

యువత ఆటలపై ఆసక్తి పెంచుకోవాలి

సూర్యాపేట, వెలుగు : యువత చదువుతో పాటు ఆటలపై ఆసక్తి పెంచుకోవాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ సూచించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలో జరుగుతున్న క్రీడా పోటీలను బుధవారం పరిశీలించి మాట్లాడారు. ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. పోటీల్లో భాగంగా గురువారం ఫైనల్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జడ్పీ సీఈవో సురేశ్‌‌‌‌‌‌‌‌, డీఈవో అశోక్, జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కమిషనర్‌‌‌‌‌‌‌‌ బి.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ రాజేంద్రప్రసాద్, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అన్నపూర్ణతో కలిసి ప్రారంభించారు. 

యాదగిరిగుట్టపై ఫ్రీడం కప్‌‌‌‌‌‌‌‌ షురూ...

యాదగిరిగుట్ట, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్టపై నిర్వహిస్తున్న ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ పోటీలను బుధవారం ఈవో గీతారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ బ్లక్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

తుంగతుర్తి, వెలుగు : కడుపు నొప్పితో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మద్దెల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ (40) ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడడంతో పాటు, ఆటో సరిగా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

కోరం లేక యాదాద్రి జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ వాయిదా

యాదాద్రి, వెలుగు : కోరం లేకపోవడంతో బుధవారం జరగాల్సిన యాదాద్రి జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ వాయిదా పడింది. ఉదయం 10.30 గంటలకే మీటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కావాల్సి ఉండగా, 11 గంటల వరకు చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎలిమినేటి సందీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి సహ ఏ ఒక్క సభ్యుడూ రాలేదు. ఆ తర్వాత జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ బీకూనాయక్, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ కే.నగేశ్, జడ్పీటీసీలు నరేందర్‌‌‌‌‌‌‌‌గుప్తా, పి. లక్ష్మితో పాటు కొందరు ఆఫీసర్లు వచ్చారు. 11.30 వరకు వెయిట్‌‌‌‌‌‌‌‌ చేసినా చైర్మన్‌‌‌‌‌‌‌‌ సహ ఇతర మెంబర్లు రాలేదు. దీంతో కోరం లేకపోవడంతో మీటింగ్‌‌‌‌‌‌‌‌ను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి ప్రకటించారు.