మూసీ సుందరీకరణకు రూ.వెయ్యి కోట్లు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు

మూసీ సుందరీకరణకు రూ.వెయ్యి కోట్లు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు

బడ్జెట్ లో భువనగిరి ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భువనగిరి ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల శామ్యూల్, వేముల వీరేశంలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలిశారు. మూసీ ప్రక్షాలన, సుందరీకరణ కోసం బడ్జెట్ లో ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

మూసీ ప్రక్షాలనతో రైతులకు శుద్ధమైన సాగు నీరు లభిస్తుందని, ఈ బడ్జెట్ కేటాయింపు వలన భువనగిరి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగం అవుతుందని ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేశారు.