నిత్యావసరాలతో పాటు, పాలపై కూడా జీఎస్టీ దారుణం

నిత్యావసరాలతో పాటు, పాలపై కూడా జీఎస్టీ దారుణం
  • నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి

కోదాడ, వెలుగు :  ప్రధాని మోడీ దేశాన్ని, సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. కేంద్రం నిత్యావసర వస్తువులతో పాటు, పాలపై కూడా జీఎస్టీ విధించడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ సమావేశాలను కుదించడం అప్రజాస్వామికం అన్నారు. విదేశాల నుంచి నల్లడబ్బు తీసుకొచ్చి పేదల అకౌంట్లలో వేస్తానన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో సంక్షేమ పాలన చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇప్పటివరకు రైతుల రుణమాఫీ నోరెత్తడం లేదన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని, స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదన్నారు. గ్రామానికి 10 బెల్ట్‌‌‌‌‌‌‌‌ షాపులు, మద్యం షాపులు పెట్టి కోట్ల రూపాయలను దోచుకుంటున్నారన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు కోదాడ నియోజకవర్గాన్ని మాఫియా సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మార్చారని, మట్టి, ఇసుక దందాలు చేస్తూ కమీషన్ల పేరుతో కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే పోలీసులను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసి తమకు అనుకూలంగా పనిచేసే వారిని తెచ్చుకుంటున్నారన్నారు.

కోదాడ నియోజకవర్గంలో 50 వేల ఇండ్లు కట్టించాల్సి ఉండగా, కేవలం 50 కట్టించి వాటిని కూడా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లకే కట్టబెడుతున్నారన్నారు. కోదాడ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ను వేధింపులకు గురిచేయడం అమానుషం అన్నారు. జాతీయ జెండాను అవమానపరిచిన మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచి 50 వేల మెజార్టీతో గెలుస్తామని, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌‌‌‌‌‌‌‌ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పార సీతయ్య, లీడర్లు వంగవీటి రామారావు, బషీర్, ధనమూర్తి, చింతలపాటి శ్రీనివాసరావు, వరప్రసాద్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.