మహిళలపై దాడి ఘటనలపై కఠిన చర్యలు: నల్గొండ ఎస్పీ

మహిళలపై దాడి ఘటనలపై కఠిన చర్యలు: నల్గొండ ఎస్పీ
  • ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా కలువొచ్చు
  • ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా, వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా
  • ప్రతి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేస్తా, క్రమశిక్షణ దాటితే చర్యలు తప్పవు
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో నల్గొండ ఎస్పీ అపూర్వరావు

నల్గొండ, వెలుగు: ‘ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటా. ఎలాంటి సమస్య ఉన్నా ఎవరైనా, ఎప్పుడైనా ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. ఆఫీసులో ఉన్నా కలవొచ్చు. ప్రజావాణిని పక్కాగా నిర్వహిస్తాం. ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాలేని వారు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా, వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా’ అని నల్గొండ ఎస్పీ అపూర్వరావు చెప్పారు. హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ఫాలో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామన్నారు. ప్రజా సమస్యలు పరిష్క రించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సోమవారం ‘వెలుగు’తో చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...

అన్ని స్టేషన్లను విజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తా 

జిల్లాలో పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ పనితీరును తెలుసుకునేందుకు 2, 3 వారాల్లో అన్ని పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్లను విజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తా. డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌ పరంగా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి ప్రయారిటీ ప్రకారం పనులు పూర్తిచేస్తాం. స్థానిక పరిస్థితులను తెలుసుకుని అన్నింటిని కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తా. ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసే వారికి కచ్చితంగా రివార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తాం. పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే  చర్యలు తప్పవు.

వారానికోరోజు అవేర్‌నెస్‌

జిల్లాలో సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాలపై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడుతాం. నా ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేను టీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడేళ్ల పాటు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి పనిచేశాను కాబట్టి సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాలపై ఇంట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపిస్తా. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల వలలో పడి ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్‌ చేస్తే అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫ్రీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయిస్తాం. ఆ తర్వాత ప్రత్యేక టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాం. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాలపై ప్రతి శుక్రవారం గానీ వారంలో ఒకరోజుగానీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లతో అవగాహన కల్పిస్తాం.

మహిళలపై దాడి చేస్తే సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మహిళలు, యువతుల హత్యలు, అత్యాచార ఘటనల్లో సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటాం. ఉమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీకి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ ఉంటుంది. ఆదివారం రాత్రి 11.30 గంటలకు నల్గొండ పట్టణంలో పర్యటించా. ఆ టైంలో మహిళలు సైతం రోడ్లపై తిరుగుతుండడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. యువతులు, మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలికలపై ఎలాంటి అఘాత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం.

నేరస్తులకు శిక్షపడేలా చర్యలు

గంజాయి, గ్యాంబ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి నేరాలపై కఠినంగా వ్యవహరిస్తాం. సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి పనిచేస్తాం. దీంతో పాటు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కేసులకు సంబంధించి త్వరగా చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసేలా కేసుల విచారణ చేపడతాం. డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరంగా అన్ని రకాల వర్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాం. దీంతో పాటు యాక్సిడెంట్ల నివారణకు చర్యలు తీసుకుంటాం. చోరీలను కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు సీసీ కెమెరాల పనితీరును మెరుగుపరుస్తాం. చోరీ అయిన సొత్తు రికవరీ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. 

కమ్యూనిటీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌

కమ్యూనిటీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తాం. వనపర్తి జిల్లాలో మహిళలకు ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పించాం. స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మాయిలకు కరాటే నేర్పించాం. ఎస్సై, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లకు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాం. కమ్యూనిటీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్న 220 మంది క్యాండిడేట్లు జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సెలక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు నల్గొండ జిల్లాలో కూడా నిర్వహిస్తాం.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే...

ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్నింటినీ స్టడీ చేస్తాం. గతంలో ఎన్నికల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. వనపర్తి జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా పనిచేశా. నల్గొండ పెద్ద జిల్లా కాబట్టి రాజకీయంగా, సామాజికంగా అన్ని సమస్యలపైన స్టడీ చేసి, కార్యాచరణ రూపొందిస్తాం.

అపూర్వరావు ఫ్యామిలీ నేపథ్యం 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బేగం బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అపూర్వరావు భర్త ఐటీ రంగంలో బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆమెకు ఏడాది వయసున్న ఇద్దరు అమ్మాయిలు (ట్విన్స్) ఉన్నారు. అపూర్వరావు తండ్రి సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా తల్లి గృహిణి. బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాక మూడేళ్ల పాటు టీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగం చేశారు. 2014లో ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించడంతో తెలంగాణ తొలి ఐపీ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పిలుస్తారు. గతంలో గోదావరి ఖని ఏఎస్పీగా, సీఐడీ ఎస్పీగా పనిచేశారు.