పెరోల్ పొడిగించండి: కోర్టులో నళిని పిటిషన్

పెరోల్ పొడిగించండి: కోర్టులో నళిని పిటిషన్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి నళిని తన పెరోల్ ను మరో నెల రోజులు పొడిగించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 25న నళినికి మద్రాస్ హైకోర్టు నెల రోజుల పెరోల్ మంజూరు చేసింది. తన కుమార్తె వివాహ ఏర్పాట్ల కోసం పెరోల్ మంజూరు చేయాలన్న నళిని విజ్ణప్తిని హైకోర్టు మన్నించింది. అయితే తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదనీ.. మరో నెల రోజుల పాటు తన పెరోల్ ను పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.