పార్లమెంట్‌లో 37 బిల్లులు పెట్టాలని కేంద్రం ప్రతిపాదన

పార్లమెంట్‌లో 37 బిల్లులు పెట్టాలని కేంద్రం ప్రతిపాదన

కేంద్ర ప్రభుత్వం సభలో 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని తెలిపారు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయొద్దని తాము చెప్పామన్నారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేసామని తెలిపారు. తెలంగాణలో పంట మొత్తం కొనాలని.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. యాసంగి పంట అసలే కొనబోమని.. ఎంత కొంటామో కూడా చెప్పలేమని అంటున్నారని తెలిపారు. అఖిలపక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళామని తెలిపారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ లో లెవనెత్తుతామన్నారు నామా నాగేశ్వర్ రావు.