ఫుడింగ్ పబ్ కేసు నిందితులకు మరో షాక్

ఫుడింగ్ పబ్ కేసు నిందితులకు మరో షాక్

ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో నిందితులు అభిషేక్, అనిల్ వేసిన బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ నెల 14 నుంచి 17 వరకు  ఇద్దరు నిందితులను పోలీసులు విచారించారు. నాలుగు రోజుల కస్టడీ పూర్తైన తర్వాత నిందితులు బెయిల్ పిటిషన్ వేశారు. పబ్ కి వచ్చినవాళ్లే డ్రగ్స్ తీసుకొచ్చారని పబ్ నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

మరిన్ని వార్తల కోసం

కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న

అనన్యా పాండే డబుల్ డ్యూటీ