
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు నమ్రత శిరోద్కర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బాబును రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానిస్తుంటారు. ప్రతి ప్రయత్నంలో మహేష్ కు అండగా నిలిచి మరింత కష్టపడేడలా ఎంకరేజ్ చేస్తారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులు చూపించిన ప్రేమను చూస్తే చాలా గర్వంగా ఉంది. మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది నమ్రత.
మహేష్ బాబు, తివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. నిన్న గుంటూరులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. "మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్‌లో మా చిత్రం విడుదలైతే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది. కానీ, ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనంద పడేవాడిని. ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’’ అని అన్నారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఎస్.రాధాకృష్ణ (చిన బాబు) నిర్మించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు రమణగాడు అనే మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అతడు, ఖలేజా సినిమాల తరువాత మహేష్ బాబు, తివిక్రమ్ కాంబినేషన్ లో మూడో చిత్రమిది.
.