టికెట్ రేట్ కాంట్రవర్శీపై స్పందించిన బాలయ్య

టికెట్ రేట్ కాంట్రవర్శీపై స్పందించిన బాలయ్య

టికెట్ రేట్ల ఇష్యూపై ఇండస్ట్రీ మొత్తం ఒకే మాట మీద ఉండాలంటున్నారు నందమూరి బాలకృష్ణ. నిన్న హైదరాబాద్‌‌‌‌లో జరిగిన ‘అఖండ’ సక్సెస్‌‌‌‌ మీట్‌‌‌‌లో తన సినిమాతో పాటు టికెట్ రేట్ కాంట్రవర్శీపై ఇలా రియాక్టయ్యారాయన. ‘‘అఖండ విడుదలతోనే సంక్రాంతి మొదలైంది. తిరునాళ్లకు వెళ్లినట్టు జనాలు థియేటర్లకి వెళ్లి చూస్తున్నారు. ఇది దేవుడిచ్చిన విజయం. వినోదాన్ని అందించే సినిమా కూడా ఒక నిత్యావసర వస్తువే. అందుకే సినీ ఇండస్ట్రీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లాలి. దీనిపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. వాళ్లందరికీ ఉపాధి లభించాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఇండస్ట్రీకి ఉండాలి. ఈ విషయంలో చిన్నా పెద్దా తేడా ఉండకూడదు. అన్ని సినిమాలూ ఆడాలి. ఏపీలో సినిమా గోడును పట్టించుకునే నాథుడే లేడు. టికెట్ల సమస్య విషయంలో సినీ పరిశ్రమ మొత్తం కలసికట్టుగా ఉండాలి. టికెట్‌‌‌‌ రేట్లు పెంచడమైనా తగ్గించడమైనా అది ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు. అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. సినిమాల ద్వారా ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తోంది. కాకపోతే థియేటర్లకి జనం వస్తారో రారో అనే అనుమానం వారికి ఉందేమో. వస్తారని మా ‘అఖండ’ సినిమా నిరూపించింది. అయినా దీనిపై నా ఒక్కడి అభిప్రాయమే ఫైనల్ కాదు.. అందరం చర్చించుకుని, మన ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వానికి పంపిద్దాం.’’