అసెంబ్లీలో మీసం తిప్పి.. తొడ కొట్టిన బాలయ్య

అసెంబ్లీలో మీసం తిప్పి.. తొడ కొట్టిన బాలయ్య

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఐదు రోజులు జరిగే అసెంబ్లీ మొదటి రోజే.. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. సభను అడ్డుకున్నారు., స్పీకర్ పోడియం ఎదుట ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 

టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు బామ్మర్ధి బాలయ్య.. వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. మీసం తిప్పారు.,. తొడ కొట్టారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అని.. దేనికైనా రెడీ అన్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. సభలో బాలయ్య మీసం తిప్పి.. తొడ కొట్టటాన్ని చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ కు దిగారు. 

 Also Read: మీసాలు, తొడకొట్టటాలు సినిమాలో చూపించుకో.. దమ్ముంటే రా బాలయ్య : సభలో అంబటి సవాల్

బాలయ్య తీరుతో.. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం ఎదుట ఉన్న వెనక్కి వెళ్లాలని.. వారి వారి సీట్లలో కూర్చోవాలని పదేపదే స్పీకర్ తమ్మినేని సీతారాం విజ్ణప్తి చేసినా వెనక్కి తగ్గలేదు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఫస్ట్ డే.. ఫస్ట్ సెషన్.. మొదటి 10 నిమిషాల్లోనే ఏపీ అసెంబ్లీ గరం గరంగా మారింది. రాబోయే నాలుగు రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.