మీసాలు, తొడకొట్టటాలు సినిమాలో చూపించుకో.. దమ్ముంటే రా బాలయ్య : సభలో అంబటి సవాల్

మీసాలు, తొడకొట్టటాలు సినిమాలో చూపించుకో.. దమ్ముంటే రా బాలయ్య : సభలో అంబటి సవాల్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో.. సభలో వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తూ.. బాలకృష్ణ మీసం తిప్పి.. తొడకొట్టటంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెలరేగిపోయారు. ఏం సవాల్ చేస్తున్నారా.. దమ్ముంటే రా బాలయ్య.. తేల్చుకుందాం అంటూ ఛాలెంజ్ చేశారు. నీ మీసం సినిమాల్లో తిప్పుకో.. మీ తొడ.. సినిమాల్లో కొట్టుకో.. ఇది అసెంబ్లీ.. ఇది రాజకీయం.. ఇది సభ.. దమ్ముంటే రా.. నువ్వే నేనో తేల్చుకుందాం అంటూ బాలయ్యకు సవాల్ చేశారు. అసెంబ్లీ అంటే సినిమా థియేటర్ కాదు.. రాజకీయం అంటే సినిమా తీయటం కాదంటూ చురకలు అంటించారు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

Also Read : అసెంబ్లీలో మీసం తిప్పి.. తొడ కొట్టిన బాలయ్య

బల్లలు కొట్టటం.. గొడవలు చేయటం.. నిరసనలు వ్యక్తం చేయటం.. సభలో కాదు.. మీ సత్తా ఏంటో.. మీ దమ్ముంటే బయట చూపించుకోవాలంటూ బాలయ్యపై ఎక్కి దిగారు అంబటి రాంబాబు. మీ బావ చంద్రబాబు నీతిమంతుడు అయితే కోర్టుల్లో చూసుకోవాలని.. లాయర్లను పెట్టి కోర్టుల్లో వాదించుకోవాలని.. అసెంబ్లీలో కాదంటూ సూచించారు. అసెంబ్లీలో రెచ్చగొట్టాలని చూస్తే.. చూస్తూ ఊరుకోమని.. మా ఎమ్మెల్యేలు తిరగబడితే ఎలా ఉంటుందో ఊహించుకో అంటూ బాలయ్యను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. నీకు దమ్మూ, దైర్యం చూపించాలంటే మేం సిద్ధం అంటూ విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే అంబటి.