
సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’తో హిట్ అందుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మాస్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణ, కామెడీ ఎంటర్‌టైనర్స్ తీసే అనిల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అన్న దిగుతుండు’ అంటూ గురించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈసారి బాలకృష్ణ బర్త్ డే నెవర్ బిఫోర్‌లా ఉండబోతోందని, అద్భుతమైన అప్‌డేట్‌ను అతి త్వరలో ఇవ్వబోతున్నట్టు ట్వీట్ చేశారు. టైటిల్, వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా రాయలసీమ నేపథ్యంలో సినిమాలు చేసిన బాలకృష్ణ.. ఈసారి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఇక్కడి యాసతో డైలాగ్స్ చెప్పబోతున్నారట. బాలకృష్ణకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. వీళ్లిద్దరూ కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైమ్. హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రను పోషిస్తోంది. షైన్‌స్ర్కీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరాకు సినిమా విడుదల కానుంది.