నందిగ్రామ్ ‘వార్’ ఇయ్యాల్నే.. బరిలో మమత, సువేందు అధికారి

నందిగ్రామ్ ‘వార్’ ఇయ్యాల్నే.. బరిలో మమత, సువేందు అధికారి
  • నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించిన ఈసీ 
  • నేడు అస్సాంలోనూ రెండో విడత పోలింగ్ 

నందిగ్రామ్/గౌహతి: వెస్ట్ బెంగాల్​లో సీఎం మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీపడుతున్న నందిగ్రామ్​ సహా 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నందిగ్రామ్​లో144 సెక్షన్ విధించింది. పోలింగ్ నేపథ్యంలో భద్రతను పెంచేందుకు ఈసీ చర్యలు తీసుకుంది. హెలికాప్టర్ ద్వారా ఎయిర్ సర్వేలెన్స్ ను కూడా ప్రారంభించింది. నందిగ్రామ్ లో తృణమూల్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి వంటి పెద్ద లీడర్లు బరిలో ఉండటంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో నందిగ్రామ్ లో ఓటు హక్కులేని వాళ్లెవరూ నియోజకవర్గంలోకి రాకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పలు ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. 144 సెక్షన్ శుక్రవారం అర్ధరాత్రి వరకూ అమలులో ఉంటుందన్నారు. బెంగాల్ రెండో విడత పోలింగ్ లో 24 పరగణాల జిల్లా, బంకూరా, వెస్ట్ మిడ్నాపూర్, ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు 8 విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడత పోలింగ్ మార్చి 27న జరిగింది. చివరగా 8వ విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. ఓట్ల కౌంటింగ్ మే 2న నిర్వహిస్తారు. అదేరోజు రిజల్ట్ ప్రకటిస్తారు. 

అస్సాంలో 39 అసెంబ్లీ స్థానాలకు..
అస్సాంలో రెండో విడతలో భాగంగా గురువారం 39 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, అపొజిషన్ పార్టీల్లోని ప్రముఖ నేతలు బరిలో ఉన్నా రు. మొత్తం 39 స్థానాల్లో 345 మంది క్యాండిడేట్లు పోటీ చేస్తుండగా, వీరిలో 26మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల్లో అస్సోం గణ పరిషత్​తో రూలిం గ్ పార్టీ బీజేపీ, ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి.