పాప నువ్వు తోపు రిలీజ్

పాప  నువ్వు  తోపు రిలీజ్

నందితా శ్వేత లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న  చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, రజిత్  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో అభినిక ఐనాభాతుని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ పాప నువ్వు తోపు’ అనే రెండో సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. మాస్ బీట్‌‌ని అనూబ్ రూబెన్స్ కంపోజ్ చేశాడు.  రైటర్  సింహాచలం లిరిక్స్ రాయగా.. ‘అలవైకుంఠపురంలో’ సిత్తరాల సిరపడు పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలసురన్న పాడాడు.  ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోస్‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో నందితా మాట్లాడుతూ ‘హారర్ చిత్రాలంటే ఒక ఎక్స్‌‌పెరిమెంట్. ఇకపై ఇలాంటి జానర్‌‌‌‌లో నటించకూడదు అనుకున్నా. కానీ దర్శకుడు కథ చెప్పిన విధానం నచ్చి ఓకే చెప్పా. అనూప్ రూబెన్స్  మ్యూజిక్ సినిమాకి హైలైట్‌‌గా ఉంటుంది’ అని చెప్పింది. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందన్నారు దర్శక నిర్మాతలు. మొదటి సాంగ్ ‘పైసా రే పైసా’ వైరల్ అయినట్టుగానే..  ‘ఓ పాప నువ్వు తోపు’ పాట కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని చెప్పాడు అనూప్. షకలక శంకర్, రజిత్ తదితరులు పాల్గొన్నారు.