
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna). కొత్త దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తెరకెక్కించిన ఈ ఎమోషనల్ కంటెంట్ మూవీలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయినా గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రేక్షకుల నుండి యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది.
ఓపక్క ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కంటెంట్, మరోపక్క యూత్ కు కావాల్సిన క్యూట్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ను బాగానే మెప్పించింది మూవీ. అయితే కంటెంట్ వరకు బాగానే ఉన్నా.. ముందు నుండి హాయ్ నాన్న సినిమాపై అంతగా బజ్ క్రియేట్ అవలేదని చెప్పాలి. ఆ ఎఫెక్ట్ హాయ్ నాన్న సినిమాపై క్లియర్ గా కనిపించింది. ఈ సినిమా మొదటిరోజు కేవలం రూ.10 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టింది. ప్రస్తుతం నాని కి ఉన్న రేంజ్ కి ఇది చాలా తక్కువ. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువగా వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ.4 నుండి రూ.5 కోట్ల వసూళ్లు మాత్రమే చేయగలిగింది ఈ మూవీ.
దీంతో నాని ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ చూస్తుంటే.. హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక శుక్రవారం నితిన్ హీరోగా వస్తున్న ఎక్ట్రా ఆర్డినరీమాన్ రిలీజ్ అవుతోంది. కాబట్టి హాయ్ నాన్న సినిమా కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో హాయ్ నాన్న సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతుందో చూడాలి.