‘రేపటి సంది దుమ్ము లేసిపోద్ది’

‘రేపటి సంది దుమ్ము లేసిపోద్ది’

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. తాజాగా చిత్రం నుంచి హీరో నాని ఓ వీడియోను లీక్‌ చేశాడు. ఊరమాస్‌ స్టెప్పులు వేస్తూ దుమ్ము లేస్తున్న వీడియోను నాని ట్వీట్ చేశాడు. ‘రేపటి సంది దుమ్ము లేసిపోద్ది’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. కాగా, ఈనెల 3న ఈ చిత్రంలోని మాస్‌ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు.

తెలంగాణలోని రామగుండం నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్‌ అలరించనుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ  చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.