ఈ సినిమా ట్రైలర్ లడ్డులా ఉంది: హీరో నాని

ఈ సినిమా ట్రైలర్ లడ్డులా ఉంది: హీరో నాని

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ప్రియాంక దత్ నిర్మించిన సినిమా మే 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌ఈవెంట్‌‌‌‌కి హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నాని మాట్లాడుతూ..‘ఈ సినిమా ట్రైలర్ లడ్డులా ఉంది. అన్ని బాగా కుదిరాయి. సంతోష్‌‌‌‌లో చాలా ఈజ్, కామెడీ టైమింగ్ ఉన్నాయి. తనను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. నందినికి సంతోష్ రూపంలో మరో నాని దొరికాడు. మాళవిక మంచి పెర్ఫార్మర్. అందరికీ గుర్తుండేలా ఇది స్పెషల్‌‌‌‌ మూవీ అవుతుంది’ అన్నాడు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘వైజయంతి సంస్థ మా ఫ్యామిలీ బ్యానర్. వీరితో అవకాశం వస్తే వదులుకోను. ఈ సినిమా సక్సెస్ సాధించాలని  కోరుతున్నా’ అన్నాడు. దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, అనుదీప్ మూవీ టీమ్‌‌‌‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. వైజయంతి బ్యానర్, నందిని రెడ్డి డైరెక్షన్‌‌‌‌, ఇంతమంది సీనియర్స్‌‌‌‌తో నటించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నాడు సంతోష్ శోభన్. ఈ సినిమా వేసవికి చిరుగాలిలా ఉంటుందన్నారు దర్శక నిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, వాసుకి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.