
నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు తెర కెక్కించిన ‘స్కైల్యాబ్’ డిసెంబర్ 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నాని చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. తను మాట్లాడుతూ ‘స్కైల్యాబ్ గురించి చిన్నప్పుడు విన్నాను. ఎక్సయిటింగ్ ఐడియా ఇది. ఈ కథ నాకే చెబుదామనుకున్నాడని తెలిసింది. చివరికి నిత్య, సత్య దగ్గరకు వెళ్లడం హ్యాపీ. ‘అలా మొదలైంది’తో జర్నీ మొదలుపెట్టిన నిత్య ఇతర భాషల్లోనూ నటించి బెస్ట్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుంది. తనే నిర్మించిందంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సత్యని చూస్తే స్టార్ అవ్వడం గ్యారంటీ అనిపిస్తుంది. తనలా టాలెంటెడ్ హీరోలు రావాలి. స్కైల్యాబ్ సక్సెస్‌కి స్కైయే లిమిట్ కావాలని కోరుకుంటున్నా’ అన్నాడు. ‘నాని అన్న ఈవెంట్‌కి వస్తే హిట్ గ్యారంటీ అనే నమ్మకం నాది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అన్నాడు సత్యదేవ్. నిర్మాతగా ఇంతకంటే బెటర్ డెబ్యూ తనకి రాదంది నిత్య. పన్నెండేళ్ల డ్రీమ్ నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు దర్శకుడు. డైరెక్టర్స్ హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహా తదితరులు పాల్గొన్నారు.