గోవాలో నాని న్యూ మూవీ షూటింగ్

గోవాలో నాని న్యూ మూవీ షూటింగ్

‘దసరా’ సినిమాతో తన కెరీర్‌‌‌‌లో మరో విజయాన్ని అందుకున్నాడు నాని. మాస్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా వచ్చిన ఈ సినిమా.. మొదటి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌‌గా 71 కోట్ల గ్రాస్‌‌ వసూళ్లు రాబట్టిందని చెబుతున్నారు నిర్మాతలు. గత కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్‌‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన నాని, ఈ సక్సెస్ జోష్‌‌లో తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌‌కి రెడీ అయ్యాడు. అతను హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్‌‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

నాని కెరీర్‌‌‌‌లో ఇది 30వ సినిమా. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. కొత్త షెడ్యూల్ సోమవారం నుండి గోవాలో మొదలవుతోంది. నలభై రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. తండ్రీకూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్‌‌లో చూపించారు. బేబి కైరా కూతురిగా నటిస్తుండగా.. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌‌‌‌ హీరోయిన్‌‌గా నటిస్తోంది. మోహన్‌‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌‌ నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రం ‘హృదయం’ ఫేమ్ హెశమ్‌‌ అబ్దుల్‌‌ వహబ్‌‌ సంగీతం అందిస్తున్నాడు.