దసరా మూవీ క్లైమాక్స్ షూట్ షురూ

దసరా మూవీ క్లైమాక్స్ షూట్ షురూ

టాలీవుడ్ హీరో నాని డిఫరెంట్ కాన్సెప్టులతో హీరోగా, నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల అతను నిర్మించిన ‘హిట్ 2’ సినిమా, ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీసులకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు హీరోగా నటిస్తున్న సినిమాలపై ఫోకస్ పెట్టాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోదావరిఖని బొగ్గు గనుల బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో రగ్డ్ లుక్‌‌లో కనిపించనున్నాడు నాని.

శుక్రవారం నుంచి క్లైమాక్స్ షూట్ స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌‌తో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. జనవరి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నాని తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నాడు.  కీర్తి సురేష్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. సముద్రఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.