
దహెగాం, వెలుగు: నానో యూరియా వాడటం వల్ల రైతులకు ఎన్నో లాభాలున్నాయని దహెగాం ఏవో రామకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని గిరవెల్లి రైతు వేదికలో యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నానో యూరియా వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. యూరియా గుళికలు వాడడం వల్ల భూమిలోని సారం దెబ్బతిని సాగుకు పనికిరాకుండా పోతుందన్నారు.
నానో యూరియా వాడకం వల్ల అనేక లాభాలున్నాయన్నారు. త్వరలో రైతులందరికీ ఎరువులు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాగజ్ నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి గౌడ్, ఏఈవోలు పాల్గొన్నారు.