భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర ప్రారంభం

భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర ప్రారంభం

చంద్రగిరి: టీడీపీ  అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభమైంది. నారావారిపల్లెలో టీడీపీ  వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. 

Also Read :- ఆంధ్రా మెడికల్ కాలేజీకి వందేళ్లు.. గ్రాండ్ సెలబ్రేషన్స్

తొలిరోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎ.ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. కాసేపట్లో నేండ్రగుంట చేరుకుని మృతి చెందిన టీడీపీ  కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. వారానికి మూడు రోజులపాటు ఈ యాత్ర జరగనుంది. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారు.