చంద్రబాబుకు షాక్ : కుప్పం నుండి తప్పుకోమన్న భువనేశ్వరి..!

చంద్రబాబుకు షాక్ : కుప్పం నుండి తప్పుకోమన్న భువనేశ్వరి..!

టీడీపీ కంచుకోట కుప్పం వేదికగా చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. కుప్పం నుండి పోటీ చేయకుండా చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం అంటూ ఆయన సతీమణి భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. గత 35ఏళ్లుగా కుప్పం నుండి పోటీ చేస్తున్నారని, ఈసారి కుప్పం నుండి తానే బరిలో నిలవాలని అనుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అయితే, స్పీచ్ చివర్లో తనకు పోటీ చేసే ఉద్దేశమే లేదని, ఇదంతా సరదాకి మాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు. 

నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబులో భయం మొదలైందని స్పష్టం అవుతుందని వైఎసార్సీపి నాయకులు కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుండి పోటీ చేయడని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు భువనేశ్వరి వ్యాఖ్యలు ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. చంద్రబాబు కుప్పం నుండి తప్పుకొని పెనుమలూరు నుండి పోటీ చేస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది.

2024ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ విపక్షాల మధ్య సీట్ల పంపకం కొలిక్కి రాకపోవటంతో నిరాశలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో తాజాగా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన తయారయ్యింది.2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి సీఎం జగన్ కుప్పంలో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా ఆ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. జగన్ కి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తోడవ్వడంతో బాబుకి కుప్పంలో వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి.కుప్పంలో తన మీదున్న వ్యతిరేకతను గ్రహించాడు కాబట్టే అక్కడ తాను పోటీ చేయకుండా భువనేశ్వరిని బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నాడని ప్రత్యర్థి వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.