ఏపీ ప్రభుత్వం కేసులతో ఇబ్బంది పెడుతోంది: నారా లోకేష్

ఏపీ ప్రభుత్వం కేసులతో ఇబ్బంది పెడుతోంది:  నారా లోకేష్

నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  రెండు రోజులు సీఐడీ విచారణ తరువాత నారా లోకేష్ జాతీయ మీడియాతో చిట్ చాట్ చేశారు.  ఈ కార్యక్రమంలో  వైసీపీ  ఎంపీ రఘురామ కృష్ణ రాజు, టీడీపీ  ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు,కనకమేడల రవీంద్ర కుమార్,కంభంపాటి రామ్మోహన్ రావు పాల్గొన్నారు.  టీడీపీ శ్రేణుల నుంచి అందిన సమాచారం ప్రకారం చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని  వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని నారాలోకేష్ జాతీయ మీడియాతో అన్నారు.  తమను ఏపీ ప్రభుత్వం కేసులతో ఇబ్బంది పెడుతోందని కేంద్రహోం మంత్రి అమిత్ షాకు చెప్పానని లోకేష్ అన్నారు.  సీఐడీ విచారణ గురించి కేంద్ర హోం మంత్రికి వివరించానన్నారు.   చంద్రబాబు ఆరోగ్య విషయం గురించి అమిత్ షా అడిగారని నారా లోకేష్ తెలిపారు. 

ALSO READ: సామర్లకోటలో జగనన్న కాలనీని ప్రారంభించిన సీఎం జగన్

రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరగలేన్న నారాలోకేష్  ... ఏపీ లో రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని కేంద్రం జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరినట్లు తెలిపారు.  చంద్రబాబు కేసుల విషయంలో  ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరతానని అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలిపారు.  కేసులకు సంబంధించి తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ను సీఐడీ అధికారులు అడుగుతున్నట్లు నారా లోకేష్ జాతీయ మీడియాకు వివరించారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.