బాబాయిని చంపిందెవరంటూ పాదయాత్రలో లోకేష్ పోస్టర్లు

బాబాయిని చంపిందెవరంటూ పాదయాత్రలో లోకేష్ పోస్టర్లు

లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణులు వివేకా త్యకు సంబంధించిన పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేశారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారంటూ.. వైఎస్ వివేకా, సీఎం జగన్‌, కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఫొటోలను ప్రదర్శిస్తూ ‘బాబాయిని ఎవరు చంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.

నారా లోకేష్ కూడా ప్లకార్డులు పట్టుకొని పాదయాత్ర వెంట ప్రజలకు చూపించారు. ప్రొద్దుటూరు టౌన్‌లో ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్‌ని చంపింది ఎవరు? అంటూ లోకేశ్‌ స్థానిక ప్రజలను అడిగారు.పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శించకూడదంటూ టీడీపీ కార్యకర్తలను ప్రొద్దుటూరు డీఎస్పీ నాగరాజు వారించారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. అన్నీ అనుమతులు తీసుకొనే తాము పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. తమను రెచ్చగొట్టేలా వైసీపీ వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరెక్కడ ఉన్నారని డీఎస్పీని లోకేష్ ప్రశ్నించారు. ముందు వెళ్లి వైసీపీ ఫ్లెక్సీలు తొలగించండని చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.