Nara Rohit: కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా.. నారా రోహిత్-నయన్ కొత్త సినిమా షురూ..

Nara Rohit: కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా.. నారా రోహిత్-నయన్ కొత్త సినిమా షురూ..

నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం  ప్రారంభమైంది. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నయన్ సారిక హీరోయిన్.

సోమవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  ముహూర్తపు షాట్‌‌‌‌కు కొరటాల శివ క్లాప్ కొట్టగా, నిర్మాత దిల్ రాజు ఫస్ట్ షాట్‌‌‌‌ను డైరెక్ట్ చేశారు. సీనియర్ నిర్మాత చదలవాడ  శ్రీనివాసరావు కెమెరా స్విచాన్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.

ఇలాంటి ఓ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో నటించడం సంతోషంగా ఉందని, టైటిల్,  ఫస్ట్ లుక్ వచ్చాక ప్రేక్షకులు మరింతగా ఎక్సయిట్ అవుతారని హీరో నారా రోహిత్ చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘రోహిత్ గారిని చాలా కొత్తగా చూపించబోతున్నా.

చాలా మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. జూన్ 10 నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్  చేస్తున్నాం. సాధ్యమైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌‌‌‌తో ఈ సినిమా వస్తోందని నయన్ సారిక చెప్పింది.

కొత్తదనం, వినోదం కలగలిసిన ఈ చిత్రంలో నారా రోహిత్ నుంచి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్‌‌‌‌ను చూడబోతున్నారని వీకే నరేష్ చెప్పారు. నారా రోహిత్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో గర్వపడే సినిమా అవుతుందని నిర్మాత భరత్ చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు.  రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, వెన్నెల కిషోర్, సంపత్, సుదర్శన్, రఘు కారుమంచి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.