మా నాన్నకు ఉద్యోగమివ్వండి.. మా ప్రాణాలు కాపాడండి

మా నాన్నకు ఉద్యోగమివ్వండి.. మా ప్రాణాలు కాపాడండి

కరోనా ప్రభావంతో చాలామంది తమ ఉద్యోగాలను కొల్పోయారు. ఒక్కసారిగా జాబ్ పోవడంతో ఏం చేయాలో తెలియక.. అయోమయానికి లోనయ్యారు. కుటుంబాన్ని పోషించడం కోసం కొంతమంది మరో జాబ్ వెతుక్కుంటే.. మరికొంతమంది తమతమ సొంతూళ్లకు వెళ్లి ఏవేవో పనులు చేసుకుంటున్నారు. ఇలా ఉద్యోగాలు పోయినవారిలో అన్ని రంగాలవారూ ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ ముఖ్యంగా విద్యారంగంపై ఎక్కువగా ప్రభావం చూపింది. విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు రాకపోవడం, విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులకు పనిలేకుండా పోయింది. దాంతో వారిని కూర్చోబెట్టి జీతాలివ్వలేక ఉన్నపళంగా ఉద్యోగాల్లోంచి తీసేసింది. ఇలా ఉపాధ్యాయులను తీసేసిన విద్యాసంస్థల్లో చిన్నా చితక నుంచి బడా కార్పొరెట్ కాలేజీల వరకు ఉన్నాయి. తెలంగాణలో ప్రముఖ కాలేజీలైన నారాయణ, చైతన్య కూడా ఈ కోవలోకి రాకుండా పోలేదు. 

కరోనా సాకుతో ఉద్యోగులను తొలగించి.. ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వకుండా ఆయా సంస్థలు వేధింపులకు గురిచేస్తున్నాయి. దాంతో అప్పుల భారం ఎక్కువై.. తమను ఆదుకోవాలంటూ దిల్ షుక్ నగర్ నారాయణ కాలేజీ తొలగించిన ఉద్యోగులు ధర్నాకు దిగారు. తిరుమలేష్, మధుసూదన్ రావు అనే ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో సహా దీక్షకు కూర్చున్నారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ దీక్షలో బాధితుల పిల్లలు కూడా కూర్చోవడం గమనార్హం. మా నాన్నను ఉద్యోగంలోకి తీసుకుని.. ఉద్యోగ భద్రత కల్పించాలని చిన్నారి దీక్షలో కూర్చోవడం అందరినీ బాధకు గురిచేసింది. బాధితుల దీక్షకు మద్ధతుగా తెలంగాణ ప్రైవేటు ఎంప్లాయ్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంతోష్ కుమార్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్ పాల్గొన్నారు. విద్యహక్కు చట్టాలను అమలు చేస్తూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీటికి సంబంధించి జీవో నెంబర్ 45, 102లను అమలు చేయాలని కోరారు.

For More News..

హైదరాబాద్ లో కంటైన్‌‌మెంట్ జోన్‌‌

ఒమిక్రాన్ కు మరో మూడు​ కొత్త లక్షణాలు

రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలిగాలులు