- ఈ నెల 7న సీసీ కెమెరాలో రికార్డ్, వీడియో వైరల్ కావడంతో టీచర్ సస్పెన్షన్
మద్దూరు/నారాయణపేట : టెన్త్ స్టూడెంట్‌పై ఓ టీచర్ లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో ఈ నెల 7న జరుగగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురువారం వెలుగులోకి వచ్చింది. మోమినాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో సి.స్వామి స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
అదే స్కూల్‌లో టెన్త్ చదువుతున్న ఓ స్టూడెంట్‌ను ఈ నెల 7న కంప్యూటర్ ల్యాబ్‌లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు ల్యాబ్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్టూడెంట్‌పై లైంగిక దాడి యత్నం విషయం బయటకు పొక్కడంతో ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్ ఘటనపై విచారణ జరపాలని డీఈవోను ఆదేశించారు. విచారణ అనంతరం టీచర్ స్వామిని సస్పెంచ్ చేస్తూ డీఈవో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
