- నారాయణపేట జిల్లాలో ఘటన
మరికల్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందిన ఓ యువకుడి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన బోడి బాల్‌రాజ్‌కు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు బుధవారం కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది.
దీంతో వారు ప్రమాద స్థలానికి వెళ్లగా బాల్‌రాజ్ తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. ఆయనను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మక్తల్ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయించాక కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
గురువారం వారు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే కొందరు ఇన్సూరెన్స్ ఏజెంట్లు బాల్‌రాజ్‌పై ప్రమాద బీమాలు చేయించి, ఆ డబ్బుల కోసమే చంపేశారని అనుమానిస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మక్తల్ సీఐ రాంలాల్, మరికల్ సీఐ భగవంత్‌రెడ్డి శుక్రవారం మృతదేహన్ని బయటకు తీయించి రీపోస్టుమార్టంకు తరలించారు.
