
కోస్గి, వెలుగు: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్ రే రూమ్ ను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
అవసరమైన మెడిసిన్స్ కోసం ఇండెంట్ పంపించాలని ఆదేశించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని సంపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన స్కూల్‌ను పరిశీలించారు. రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ నాగరాజ్, తహసీల్దార్ బక్క శ్రీనివాస్, మున్సిపల్ ఏఈ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.