హైదరాబాద్, వెలుగు: నారాయణపేట జిల్లాలోని కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఇకపై జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోకి రానుంది. ఈ కాలేజీని నేరుగా వర్సిటీ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలేజీగా రూరల్ ఏరియాలో ఉండటంతో విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఆసక్తి చూపకపోవడంతో అడ్మిషన్లు భారీగా పడిపోయాయి.
కోస్గిలో సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో మూడు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రారంభించిన నాటి నుంచి అడ్మిషన్ల కష్టాలు కాలేజీని వెంటాడుతున్నాయి.
గవర్నమెంట్ కాలేజీ అనే ముద్ర ఉన్నా, సాంకేతిక విద్యాశాఖ పర్యవేక్షణలో ఉండటంతో విద్యార్థులు చేరేందుకు వెనకాడుతున్నారు. కాగా, ఈ విద్యాసంవత్సరం నుంచి జేఎన్టీయూ కాలేజీగానే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.
