ఏప్రిల్ 20 వరకు లాక్ డౌన్ కఠినంగా అమలు

ఏప్రిల్ 20 వరకు లాక్ డౌన్ కఠినంగా అమలు
  • కరోనా హాట్ స్పాట్లపై ఎక్కువగా ఫోకస్
  • లాక్ డౌన్ పై రేపు గైడ్ లైన్స్ రిలీజ్

దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోడీ. జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోడీ..లాక్ డౌన్ ను పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాల సీఎంలు చెప్పారన్నారు. 21 రోజుల లాక్ డౌన్ ను  దేశం కట్టుదిట్టంగా అమలు చేసిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ను తొలగించడం సరికాదన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా కట్టడిలో మెరుగ్గా ఉందన్నారు. ఈ నెల 20 వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామన్నారు. ఆ తర్వాత కరోనా హాట్ స్పాట్లు కాని  ప్రాంతాల్లో సడలింపునిస్తామన్నారు. లాక్ డౌన్ పై రేపు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు.

కరోనా మహమ్మారిగా మారకముందే దేశంలో చర్యలు చేపట్టామన్నారు మోడీ. కరోనా వేగంగా విస్తరిస్తుందన్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారన్నారు. దేశ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో తనకు తెలుసన్నారు.  లాక్ డౌన్ కష్టాలు తట్టుకుంటూ ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడుకుంటున్నారని చెప్పారు.

దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సైనికుల్లా కరోనాపై పోరాటం చేస్తున్నారన్నారు మోడీ . కరోనాపై పోరాటం చేయడంలో దేశం మొత్తం ఒకేతాటిపై ఉందన్నారు. ప్రజల త్యాగాల వల్లే కరోనా నష్టాన్ని తగ్గించుకున్నామన్నారు. దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాకముందే దేశంలోకి వచ్చే వారిని స్క్రీనింగ్ చేశామన్నారు.