నవంబర్ 11న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’

నవంబర్ 11న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’

ఒకప్పుడు కామెడీ చిత్రాలతో నవ్వించిన అల్లరి నరేష్ ప్రస్తుతం వరుస సీరియస్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘నాంది’ సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత నరేష్ నటిస్తున్న మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనంది హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 11న విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ  కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించారు.

నవంబర్ 25న ఈ మూవీని విడుదల చేయనున్నట్టు కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. ఇందులో నరేష్​ ఎలక్షన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘ఉగ్రం’ చిత్రంలోనూ నటిస్తున్నాడు నరేష్​.