స్టేజిపైనే ముద్దులు, కౌగిలింతలు : రెచ్చిపోయిన నరేష్, పవిత్ర

స్టేజిపైనే ముద్దులు, కౌగిలింతలు : రెచ్చిపోయిన నరేష్, పవిత్ర

నరేష్, పవిత్ర లోకేశ్ ముద్దులతో రెచ్చిపోయారు. ఈ జంట తాజాగా ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షోకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో డాన్సులతో, ముద్దులతో రెచ్చిపోయారు నరేష్, పవిత్ర జంట. ఈ సంధర్బంగా యాంకర్ ఓంకార్ మీరు ముద్దుగా పవిత్ర లోకేశ్ ను ఏమని పిలుస్తారని అడిగాడు. దానికి నరేష్ అమ్ములు అని పిలుస్తానని తెలిపాడు. ఇంకా ముద్దొస్తే అమ్ము అని పిలుస్తానని,ఇంకా ముద్దొస్తే వద్దులే అంటూ.. ఆ టాపిక్ ను దాటవేశారు నరేష్.

ఇక నరేష్ చెప్పిన సమాధానానికి పవిత్ర సిగ్గుపడుతూ కనిపించింది. మధ్యలో మహేష్ బాబు కమాన్.. కమాన్.. కళావతి  సాంగ్ కు స్టెప్స్ కూడా వేశారు నరేష్, పవిత్ర జంట. ఇక డాన్స్ మధ్యలో నరేష్ పవిత్ర చేతికి, నుదుటిపై ముద్దు కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనికి నెటిజన్స్ కూడా అదిరిపోయే కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఈ జంటకు అనుకూలంగా స్పందిస్తే.. మరికొందరు వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ వయసులో మీకు ఇవి అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక నరేష్, పవిత్ర లోకేష్ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపుగా 15 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నరేష్, పవిత్ర లోకేశ్ కలిసి సిక్స్త్ సెన్స్ షోకు హాజరయ్యారు.