మళ్లీ పెళ్లి ట్రైలర్ : 60లో.. 20 లవ్ స్టోరీ.. ఇంటి గుట్టు విప్పిన పవిత్ర నరేష్

మళ్లీ పెళ్లి ట్రైలర్ : 60లో.. 20 లవ్ స్టోరీ.. ఇంటి గుట్టు విప్పిన పవిత్ర నరేష్

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ "మళ్ళీ పెళ్లి". విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మిస్తన్న ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ మే 26న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక విజయ్ కృష్ణ మూవీస్ సంస్థ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్బంగా కొత్త లోగోని రిలీజ్ చేశారు నరేష్, పవిత్ర.

ఇందులో భాగంగా మళ్ళీ పెళ్లి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇది నరేష్, పవిత్రల నిజజీవిత కథే అని క్లియర్ గా అర్థమవుతోంది. హీరో నరేష్ కి మూడో పెళ్లి తరువాత ఎం జరిగింది. ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఆయన లైఫ్ లోకి పవిత్ర ఎంట్రీ ఎలా జరిగింది అనేది మిగిలిన కథ. ఇక మొత్తంగా.. ట్రైలర్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీని రేకెత్తించారు.

కొంత కాలం వరకు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన నరేష్, పవిత్రల వివాదంపై ఈ సినిమా వస్తుండటంతో.. అసలు ఎం జరిగింది అనేది తెలుసుకోవడానికైనా ఆడియన్స్ ఈ మూవీ చూసే అవకాశం ఉంది. మే 26న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

https://www.youtube.com/watch?v=SRwoBv_sI5o