
- నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట, వెలుగు : వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలంతా ఆర్థికంగా ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఖానాపురం చైతన్య మండల సమాఖ్య 16వ వార్షిక సభ మంగళవారం జరిగింది. ఈసభకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చిందన్నారు.
ఇప్పుడు వడ్డీలేని రుణాలను ఇస్తోందని చెప్పారు. ఖానాపురం మండలంలోని వివిధ గ్రామాల స్వయం సహాయక సంఘాలకు రూ.10.20 కోట్ల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు పాల్గొన్నారు.