మిత్రుడి కుటుంబానికి చేయూత.. నిర్మల్ జిల్లా కు చెందిన శంకర్ బ్రెయిన్ స్ట్రోక్తో మృతి

మిత్రుడి కుటుంబానికి చేయూత.. నిర్మల్ జిల్లా కు చెందిన శంకర్  బ్రెయిన్ స్ట్రోక్తో మృతి

నర్సాపూర్ జి, వెలుగు: చనిపోయిన మిత్రుడి కుటుంబానికి చేయూతగా నిలిచారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలోని గొల్లమాడకు చెందిన దేహొళ్ల శంకర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్​తో చనిపోయాడు. దీంతో శంకర్​తో కలిసి బెల్లంపల్లి గురుకులంలో టెన్త్​చదివిన 1998–99  బ్యాచ్ మిత్రులంతా విరాళాలు సేకరించారు. రూ. 70 వేలు పోగుచేసి శంకర్ భార్యకు బుధవారం అందజేశారు. భవిష్యత్​లోనూ అతడి భార్యాపిల్లలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. సహాయం అందజేసిన వారిలో సత్యనారాయణ, తోట లక్ష్మణ్, ఎంపీటీసీ సురేశ్, ఎల్ఐసీ లక్ష్మణ్, పంతుల సుభాష్, శేఖర్, భాస్కర్, పోశెట్టి,  గంగాధర్ తదితరులున్నారు.