మా గ్రామానికి ఏం చేశారని.. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు: గ్రామస్థులు

మా గ్రామానికి ఏం చేశారని.. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు: గ్రామస్థులు

ఎన్నికల ప్రచారానికి గ్రామాలకు వెళ్తున్న బీఆర్ఎస్ లీడర్లకు నిరసన సెగలు తగులుతున్నాయి. మా గ్రామానికి ఏం చేశారని.. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారని స్థానికులు అడుగడుగునా లీడర్లను నిలదీస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా కొల్చారం మండలం లింగోడ్ల గడ్డలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.

ఎస్సీ కాలనీలో రోడ్లు అద్వానంగా మారాయని.. దీని గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు తమ గ్రామంలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా రాలేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.