Premalu Sequel Official: మరింత ప్రేమతో ప్రేమలు2 వచ్చేస్తోంది..అనౌన్స్ చేసిన మేకర్స్

Premalu Sequel Official: మరింత ప్రేమతో ప్రేమలు2 వచ్చేస్తోంది..అనౌన్స్ చేసిన మేకర్స్

మలయాళంలో సూపర్ హిట్టైన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ప్రేమలు(Premalu). కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.135 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రేమలు సినిమా గురించే చర్చ నడిచింది. మలయాళంలో ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపధ్యంలో ఇటీవలే ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులోనూ రికార్డులు క్రియేట్ చేసింది. 

లేటెస్ట్గా ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మలయాళ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమలు..ఈ ఏడాది ఏకంగా ఆడియన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. దీంతో మూవీ సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈమేరకు ప్రేమలు 2 టైటిల్ తో ఈ సినిమా రానున్నట్లు ఎక్స్ ద్వారా మూవీ సీక్వెల్, టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు.

"మలయాళం సినిమాలో గతంలో ఎన్నడూ లేని అతిపెద్ద రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ 2025లో మళ్లీ మీ ముందుకు వస్తోంది. ప్రేమలు 2 చేసుకుందాం" అనే క్యాప్షన్ తో ఈ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ కు కూడా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించనున్నాడు. 

అయితే రాజమౌళి కార్తికేయ సినిమా పోస్టర్ ను అనౌన్స్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.."ప్రేమలు నా జీవితంలో ఒక అందమైన అధ్యాయం. దీన్ని మరిచిపోలేని విధంగా చేసినందుకు నా తెలుగు ప్రేక్షకులకు నేను నిజంగా కృతజ్ఞుడను.ధన్యవాదాలు
మరింత ప్రేమతో ప్రేమలు2ని తెలుగులో అందించడానికి సంతోషిస్తున్నాము" అంటూ తెలిపారు 

దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.దీంతో తెలుగులో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మార్చ్ 8న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబడుతోంది.ఒక సినిమా చూస్తూ ఈ రేంజ్లో  నవ్వి చాలా కాలమైంది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు,డైరెక్టర్ అనిల్ రావిపూడి,రాజమౌళి వంటి ప్రముఖులు సైతం..ప్రేమలు సినిమా గురించి చెప్పడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.