
న్యూఢిల్లీ: తమ తెలంగాణ ప్లాంట్‌కు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ నుంచి హెచ్చరిక లేఖ అందిందని నాట్కో ఫార్మా మంగళవారం తెలిపింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) కంపెనీ కొత్తూరులోని ఫార్ములేషన్ సౌకర్యాన్ని పరిశీలించిన తర్వాత ఫారం–483 కింద ఎనిమిది అబ్జర్వేషన్లను జారీ చేసింది. ఈ తనిఖీని యూఎస్‌ఎఫ్‌డీఏ అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 18, 2023 వరకు నిర్వహించింది.
వార్నింగ్ లెటర్ సరఫరాలపై ప్రభావం చూపుతుందని లేదా ఈ సదుపాయం నుంచి ప్రస్తుతం ఉన్న ఆదాయాలపై ప్రభావం చూపుతుందని కంపెనీ భావించడం లేదు. ఇది ఈ సైట్ నుంచి పెండింగ్‌లో ఉన్న ఉత్పత్తి ఆమోదాలను ఆలస్యం/నిలిపివేయడానికి కారణం కావచ్చని నాట్కో ఫార్మా తెలిపింది. ఈ లెటర్‌కు త్వరలోనే జవాబు పంపిస్తామని తెలిపింది.