
- షేరుకి రూ.1.25 డివిడెండ్
హైదరాబాద్, వెలుగు: నాట్కో ఫార్మాకు కిందటేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో రూ.212.7 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. రెవెన్యూ పెరగడంతో అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ. 62.3 కోట్ల ప్రాఫిట్‌తో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.492.5 కోట్ల నుంచి రూ.758.6 కోట్లకు ఎగసింది. కంపెనీ మొత్తం ఖర్చులు రూ. 431.9 కోట్ల నుంచి రూ.539.3 కోట్లకు పెరిగాయి.
2022 డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే తాజా క్యూ3 లో అన్ని సెగ్మెంట్లలో మంచి గ్రోత్ కనిపించిందని నాట్కో ఫార్మా ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. రానున్న క్వార్టర్లలో కూడా ఇదే ట్రెండ్ ఉంటుందని వెల్లడించింది. ఫార్ములేషన్స్ (మందులు) ఎగుమతుల ద్వారా క్యూ3 లో రూ.605.6 కోట్ల ఆదాయాన్ని కంపెనీ సాధించింది. 2022 డిసెంబర్ క్వార్టర్‌లో ఈ నెంబర్ రూ.333.7 కోట్లుగా ఉంది. అదే డొమెస్టిక్ మార్కెట్‌లో ఫార్ములేషన్స్ సేల్స్ ద్వారా రూ. 99.4 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇది రూ. 101.1 కోట్ల నుంచి (ఇయర్ ఆన్ ఇయర్) తగ్గింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ విభాగం నుంచి కంపెనీకి రూ. 46.3 కోట్ల రెవెన్యూ వచ్చింది.