
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా జబర్దస్త్ ఫేమ్ శాంతికుమార్ దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ మూవీ టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కథలో కొత్తదనం కనిపిస్తోంది, చక్కని కథనం, సస్పెన్స్ క్యారీ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. శాంతి కుమార్ మాట్లాడుతూ ‘జబర్దస్త్ కమెడియన్‌గా నవ్వించిన నేను, ఇప్పుడు దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు నేనే రాసుకుని నిర్మాతల సహకారంతో సినిమా పూర్తి చేశాం’అన్నాడు. ఇక టీజర్ విషయానికొస్తే.. ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథ ఇదని తెలుస్తోంది. ‘గొప్పగా కనిపించే ప్రతి విజయం వెనుక, కదిలించే విషాదం కచ్చితంగా ఉంటుంది’ అనే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.