దేశమంతా మీకు అండగా ఉంటుంది

దేశమంతా మీకు అండగా ఉంటుంది
  • పశ్చిమ బెంగాల్‌కు మోడీ భరోసా

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుపాను సంభవించిన ఈ కష్టకాలంలో దేశమంతా పశ్చిమబెంగాల్‌కు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో అంఫాన్‌ సృష్టిస్తున్న బీభత్సంపై మోడీ ట్వీట్‌ చేశారు. “ పశ్చిమ బెంగాల్‌లో అంఫాన్‌ వల్ల ఏర్పడ్డ పరిస్థితిని విజువల్స్‌లో చూస్తున్నాను. ఈ కష్టకాలంలో దేశమంతా మీ వెంట అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. సాధారణ పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను” అని మోడీ ట్వీట్‌ చేశారు. ఎన్డీఆర్‌‌ఎఫ్‌ సిబ్బంది పరిస్థితిని మానిటర్‌‌ చేస్తున్నారని, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని మరో ట్వీట్‌ చేశారు. అంఫాన్‌ తుపాను పశ్చిమబెంగాల్‌లో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు.