మంచిర్యాలలో రేపు (సెప్టెంబర్ 10న) అప్రెంటీస్ షిప్ మేళా

మంచిర్యాలలో రేపు (సెప్టెంబర్ 10న) అప్రెంటీస్ షిప్ మేళా

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల గవర్నమెంట్ ఐటీఐలో సోమవారం ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ రమేశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీబ్యాక్ ఇండియా, మేధా సర్వో, ప్రీమియర్ ఇంజినీర్స్, ఎంటార్ టెక్నాలజీస్, సెండ్లర్ ఎలక్ట్రిక్, గ్రాన్యూల్స్ ఇండియా టీకెల్ టెక్నాలజీస్, వెమ్ టెక్నాలజీస్, ఆదర్శ ఆటోమొబైల్స్ కంపెనీలు మేళాలో పాల్గొం టాయని తెలిపారు. 

ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, సోలార్ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్ తదితర పో స్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. అర్హత గలవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.