
రామచంద్రాపురం, వెలుగు : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ ఢిల్లీ పబ్లిక్స్కూల్లో నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను డీపీఎస్ అసోపియేషన్ జాయింట్ డైరెక్టర్ డోలీ చాన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు జమ్మూ, బెంగళూరు, హరిద్వార్, నవీ ముంబయి, అమృత్సర్, గయ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. కొల్లూర్ బ్రాంచ్ చైర్మన్ తూమ్ భీంసేన్, సెక్రటరీ ప్రణయ కుమార్, తూమ్ పవన్ కళ్యాణ్, ప్రిన్సిపల్ సీజే వసంత పాల్గొన్నారు.