
హైదరాబాద్, వెలుగు: నేషనల్ కౌన్సిల్ ఫర్ కో–ఆపరేటివ్ ట్రైనింగ్ (ఎన్‌సీసీటీ), సహకార సంఘాలకు నైపుణ్యం, సాధికారత కల్పించడానికి 2023-–24లో దేశవ్యాప్తంగా 3,619 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో 2.21 లక్షల మంది పాల్గొన్నారు. చేనేత, ఫుడ్‌ప్రాసెసింగ్, డెయిరీ వ్యాపారాల వంటి వాటివి సహకార రంగ సంస్థలు అంటారు. భారత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలలో అవగాహనను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తున్నామని ఎన్‌సీసీటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో 70,169 (31.68 శాతం) మంది మహిళలు ఉన్నారు. 2023-–24 సంవత్సరంలో, ఎన్‌సీసీటీ, దాని శిక్షణా విభాగాలు అనేక కొత్త అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయ జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి.