తెలంగాణ సీఎస్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి

తెలంగాణ సీఎస్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి

తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ కంకరమిషన్ల పై సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఉల్లంఘనలకు పాలుపడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత జరిమానా విధించారో చెప్పలేదంది. చీఫ్ సెక్రటరీ నివేదిక సమగ్రంగా లేదని చెన్నై ఎన్జీటి విమర్శించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను ఆదేశించింది. పిసాటి ఇందిరరెడ్డి,నిఖిల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్జీటి చెన్నై బెంచ్ విచారణ జరిపింది.

తెలంగాణలో 734 కంకర మిషన్లు ఉండేవని ,ప్రసుత్తం 208 పని చేయడం లేదని,74 కంకర మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని మూసివేయించమని ఎన్జీటికి తెలిపారు తెలంగాణ సీఎస్. అక్రమంగా మిషన్లు పని చేస్తున్న పట్టించుకోని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఎన్జీటికి  తెలంగాణ సీఎస్ తెలిపారు. హైదరాబాద్ శివారులో అక్రమ మైనింగ్ జోన్ వల్ల తలెత్తుతున్న పర్యావరణ సమస్యల పై  వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 28 కి చెన్నై ఎన్జీటి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి:

గోవా, మణిపూర్లో సిట్టింగ్ సీఎంలకు సెకండ్ ఛాన్స్..!

సీఎల్పీలో సోనియా నాయకత్వాన్ని బలపరిచాం