నేషనల్ హెరాల్డ్ కేసు:రాహుల్ గాంధీ, సోనియాకు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసు:రాహుల్ గాంధీ, సోనియాకు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు శుక్రవారం  (మే2) నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది. 

ఈ కేసులో గతంలో కోర్టు నోటీసు జారీ చేయడానికి నిరాకరించిన తర్వాత ఈ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు పరిశీలన దశలో ఉంది..నిందితులపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. 

Also Read : యుద్ధ భయంతో వణికిపోతూ ట్రంప్ను ఆశ్రయించిన పాక్

ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు.. 

నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీలాండరింగ్ జరిగిందని 2014లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి కోర్టులో  పిటిషన్ వేశారు. పిటిషన్ ను కోర్టు పరిశీలించిన తర్వాత 2021లో ఈడీ దర్యాప్తుకు ప్రారంభించింది. ఈ ఫిర్యాదులో సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, దివంగత పార్టీ నేతలు మోతీలాల్ వోరా ,ఆస్కార్ ఫెర్నాండెజ్ వంటి కీలక కాంగ్రెస్ ప్రముఖులు, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీలు మనీలాండరింగ్ కు కుట్ర చేశారని ఆరోపించింది. 

అసోసియేట్ జనరల్ లిమిటెడ్ (AJL) కి చెందిన 2వేల కోట్ల విలువైన ఆస్తులను మోసపూరితంగా సంపాదించారని ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.సోనియా,రాహుల్ గాంధీ, యంగ్ ఇండియన్ లో మెజార్టీ వాటాదారులు, ఒక్కొక్కరికి 38 శాతం వాటా ఉంది. ఈ కేసులో గతంలో రాహుల్, సోనియాలో ఈడీ ప్రశ్నించింది.